Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును దేశ అధికార పీఠం నుంచి దించేసేందుకు బలమైన వ్యూహం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 2022 నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాజీ చీఫ్ గాది ఐజన్కోట్ అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగారు. జూన్ 30 (మంగళవారం) నాడు ఆయన తన సంచలన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.
కొత్త పార్టీతో మాజీ ఆర్మీ చీఫ్ హల్చల్
ఇప్పటివరకు బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని ‘బ్లూ అండ్ వైట్’ పార్టీలో ఉన్న గాది ఐజన్కోట్, తాజాగా ఆ పార్టీని వీడి ‘యషర్’ (Yashar) అనే కొత్త సెంట్రిస్ట్ పార్టీని స్థాపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత నెతన్యాహు ప్రభుత్వం దేశంలో అరాచకాన్ని, తీవ్ర సామాజిక విభజనను సృష్టిస్తోందని ఆరోపించారు. దేశాన్ని ఏకం చేసే నాయకుడిగా తాను ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఐజన్కోట్.. విద్య, ఆర్థిక వ్యవస్థ, ప్రజా రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తానని హామీ ఇచ్చారు. “ఇజ్రాయెల్ గెలవాలి” అనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఐజన్కోట్.. అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడిని ప్రస్తావిస్తూ నెతన్యాహు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
“రాబోయే అక్టోబర్‌తో ఆ భయంకరమైన అక్టోబర్ నాటి వైఫల్యాల ప్రభుత్వానికి అంతం పాడుతాం. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక సరికొత్త, అత్యుత్తమ అధ్యాయాన్ని ప్రజలతో కలిసి లిఖిస్తాం” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నెతన్యాహు పేరును నేరుగా ప్రస్తావించకుండా.. కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం దేశంలో చీలికలు తెస్తున్నారని, ఇది మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించే సైనికులను అవమానించడమేనని మండిపడ్డారు. ముఖ్యంగా యూదులకు (హారేది సమాజం) సైనిక సేవ నుంచి మినహాయింపు ఇచ్చే వివాదాస్పద చట్టాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన అధికారంలోకి వస్తే అక్టోబర్ 7న హమాస్ జరిపిన నరమేధం, వైఫల్యాలపై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత స్థాయి ‘రాష్ట్ర కమిషన్’ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రిజర్వ్ సైనికులపై భారాన్ని తగ్గిస్తూ, వారి సేవలను ఏడాదికి గరిష్టంగా 50 రోజులకు పరిమితం చేస్తామన్నారు. దీంతో పాటు హారేది, అరబ్ కమ్యూనిటీలను కూడా సైనిక సేవల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు. నఫ్తాలీ బెనెట్, యాయర్ లాపిడ్ వంటి నాయకుల నుంచి కూటమి ఒత్తిడి ఉన్నప్పటికీ, తన నాయకత్వం లేని ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోనని స్పష్టం చేశారు.
నెతన్యాహుకు అత్యంత బలమైన ప్రత్యర్థి..
కేవలం నాలుగేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన మాజీ జనరల్ గాది ఐజన్కోట్, ఇప్పుడు నెతన్యాహుకు అత్యంత బలమైన ప్రత్యర్థిగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత నెతన్యాహు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్లో చేరినప్పటికీ, గాజా విషయంలో నెతన్యాహుకు సరైన వ్యూహం లేదని ఆరోపిస్తూ 2024 లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే నెతన్యాహు నేతృత్వంలోని ‘లికుడ్ పార్టీ’ కూడా దీనిపై కౌంటర్ ఇచ్చింది. గాజాలో కొన్ని కీలక సైనిక చర్యలను వ్యతిరేకించిన ఐజన్కోట్ మాటలు విని ఉంటే, ఈపాటికి మొత్తం ప్రాంతం హమాస్ గుప్పిట్లోకి వెళ్లేదని నెతన్యాహు విమర్శించారు. ఏదేమైనా, మాజీ సైన్యాధిపతి ఎంట్రీతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు