Harish Rao : నాడు కిడ్నీ రోగం వస్తే ప్రాణాలు పోయినంతపని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డయాలసిస్ చేయించుకోవాల్సిన నిరుపేద కిడ్నీ రోగులకు శుభవార్త. కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి సౌకర్యార్థం మరో రెండు డయాలసిస్ సెంటర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాలపై భారం పెరగడంతోపాటు తమ పేర్లు నమోదు చేసుకున్న పలువురు డయాలసిస్ రోగులు తమ వంతు కోసం ఎదురుచూస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మూడు డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసి ఉచితంగా చికిత్స అందించింది. మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు యెల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రెండు కొత్త డయాలసిస్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. అయితే వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో ప్రస్తుత కేంద్రాలపై భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘ నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని. వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి.
Also Read : Bhatti Vikramarka : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ భృతి 4 వేలు ఇస్తాం
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
కానీ నేడు స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సీఎం కేసీఆర్ గారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశారు. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారు. BRS Party ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయి. సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని సగర్వంగా చెప్తున్నాం. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా, పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్ పాస్ లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైందన్నది అక్షర సత్యం.’ అని మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.
Also Read : Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!