NTV Telugu Site icon

Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.

Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్‌ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్‌ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్‌ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించేందుకు SLBC సొరంగం ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, ప్రభుత్వ అధికారుల సూచన మేరకు పోలీసులు వారిని ఆపివేశారు. పోలీసుల తీరుపై హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. పోలీసుల అనుమతి లభించకపోవడంతో హరీష్‌ రావు, బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు అసెంబ్లీ సభ్యులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని మండిపడ్డారు. సహాయక చర్యల్లో అక్రమాలు జరుగుతున్నాయా? ప్రజలకు అసలు నిజాలు చెప్పకుండా ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది? అంటూ హరీష్‌ రావు ప్రశ్నించారు.

S.S. Rajamouli: అమ్మాయి వల్ల.. వివాదంలో స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ?

“ప్రజా ప్రతినిధులుగా మేం అక్కడికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవడానికి హక్కు ఉంది. సహాయక చర్యలు సజావుగా సాగుతున్నాయా? లేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా? అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా పోలీసులు మాపై ఆంక్షలు విధించడం చాలా ఆశ్చర్యకరం” అని హరీష్‌ రావు తీవ్రంగా స్పందించారు. మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.. శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచండని ఆయన కోరారు. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని హరీష్‌ రావు సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఇక్కడికి వచ్చేందుకు టైమ్‌ దొరకడం లేదని హరీష్‌ రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని హరీష్‌ రావు విమర్శించారు.

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన మాజీ ఈఎన్సీల విచారణ