Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.
- మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా
- శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచండి
- నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలి
- సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చేందుకు టైమ్ దొరకడం లేదు
- కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించేందుకు SLBC సొరంగం ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, ప్రభుత్వ అధికారుల సూచన మేరకు పోలీసులు వారిని ఆపివేశారు. పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. పోలీసుల అనుమతి లభించకపోవడంతో హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు అసెంబ్లీ సభ్యులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని మండిపడ్డారు. సహాయక చర్యల్లో అక్రమాలు జరుగుతున్నాయా? ప్రజలకు అసలు నిజాలు చెప్పకుండా ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది? అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.
S.S. Rajamouli: అమ్మాయి వల్ల.. వివాదంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ?
Also Read
“ప్రజా ప్రతినిధులుగా మేం అక్కడికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవడానికి హక్కు ఉంది. సహాయక చర్యలు సజావుగా సాగుతున్నాయా? లేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా? అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా పోలీసులు మాపై ఆంక్షలు విధించడం చాలా ఆశ్చర్యకరం” అని హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.. శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచండని ఆయన కోరారు. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని హరీష్ రావు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చేందుకు టైమ్ దొరకడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని హరీష్ రావు విమర్శించారు.
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన మాజీ ఈఎన్సీల విచారణ
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!