మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని.. కలను సాకారం చేశామన్నారు.
READ MORE: RCB IPL 2025 Winner: అరగుండు, మెడలో చెప్పుల దండ.. ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్న తాండూర్ యువకుడు!
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పర్యావరణ పరిరక్షణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కల నాటే హరిత నిధిని 53% తగ్గించిందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో చెట్లను నరికివేసి, పర్యావరణానికి, అక్కడి వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలిగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యావరణ విధ్వంసంతో పాటు పాలనలో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. హెచ్‌సీయూలో చెట్లు రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలకు బలైపోయాయని.. హెచ్‌సీయూ అటవీ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కేవలం నినాదం కాదు.. అది మన బాధ్యత అని.. తెలంగాణ ప్రజల కోసం తాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
READ MORE: Ameerkhan : లోకేశ్ కనకరాజ్‌తో మూవీ.. క్లారిటి ఇచ్చిన అమీర్ ఖాన్
