క్రికెట్ అభిమానులకు పిచ్చి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరుకున్నపుడు ఏవేవో ఛాలెంజ్‌లు చేస్తుంటారు. భారత్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ గతంలో చాలా మంది చెప్పారు. బాలీవుడ్‌లో చాలామంది ఛాలెంజ్‌లు చేశారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో విజేతగా నిలిస్తే.. బట్టలు లేకుండా వైజాగ్ బీచ్‌లో తిరుగుతానని టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ కూడా ప్రకటించింది. తాజాగా ఓ తెలుగు యువకుడు ఛాలెంజ్ చేసి నిలబెట్టుకున్నాడు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన ఓ యువకుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ఛాలెంజ్ చేశాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్ కొడితే తాండూరు బస్ స్టాండ్‌లో అరగుండు కొట్టుకొని, మెడలో చెప్పుల దండవేసుకొని తిరిగుతానని ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పలువురు ఇన్‌స్టా యూజర్లు ఆ ఛాలెంజ్‌ను యాక్సెప్టెడ్ అంటూ కామెంట్స్ చేశారు. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
Also Read: 2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!
ఆర్సీబీ కప్ కొట్టడంతో సదరు యువకుడు ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్నాడు. ఆర్సీబీ గెలిచినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, తన ఛాలెంజ్‌ను నిలబెట్టుకునే సమయం వచ్చింది అంటూ.. అరగుండు కొట్టుకొని, మెడలో చెప్పుల దండవేసుకొని తాండూరు బస్ స్టాండ్‌లో తిరిగాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్న కామెంట్స్ చేటున్నారు. పోరానికి బాగా అయింది అని కొందరు ఎద్దేవా చేస్తుంటే.. చేసిన ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్నాడు అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. సెమీ ఫైనల్ మ్యాచులో పంజాబ్ కింగ్స్ గెలుపొందితే తాండూరు చౌరస్తాలో షర్టు విప్పుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేసి కూడా నిలబెట్టుకున్నాడు.