మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని..…
KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి హృదయపూర్వకంగా స్వాగతం తెలిపింది. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొనింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం అంటూ పేర్కొన్నారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం…