Harish Rao: తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్రమంత్రికి లేఖ..
- తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ
- గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసిల గోదావరి నీటిని..,
- పెన్నా బేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయి- హరీష్
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘన- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘన అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి రెండు లేఖలు రాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Venkatesh: ఇది కదా కిక్కంటే… వెంకీ మామ కోసం ట్రాక్టర్లు కట్టుకుని వెళ్తున్నారు!
Also Read
- Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండడం శోచనీయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు TAC అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ NOC జారీపై కేంద్రం జోక్యం అవసరం అని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు.
Read Also: Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి
మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని హరీష్ రావు తెలిపారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదని తెలిపారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తక్షణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని హరీష్ రావు కోరారు.
తాజావార్తలు
-
Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!