Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అంటూ లేఖలో పేర్కొన్నారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు? అని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా? అని నిలదీశారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు.
“కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలి. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయి. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చింది. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు? కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలి. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది.” అని మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!