Site icon NTV Telugu

Harish Rao : ప్రతీ మాట సత్య దూరం.. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది

Harish Rao

Harish Rao

ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ట్రైన్‌ను ప్రారంభించారు. అయితే.. పరేగ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌తో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా.. ‘ ప్రధాని మోడీ గారు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణ పై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉంది. ప్రతీ మాట సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతా లో జమ అవుతున్నాయి. తన వల్లే డిబిటి మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది? రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది.

Also Read : AP Politics: హస్తినలో ఏపీ రాజకీయం.. మొన్న పవన్, నేడు సోము.. ఏం జరుగుతోంది?

పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIR ను బెంగళూర్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు? అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు.’ అని ట్విట్టస్త్రాలు సంధించారు.

Also Read : Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి

Exit mobile version