Dashamakan : హరీష్ కళ్యాణ్ హీరోగా ‘దాషమకాన్’ టైటిల్ ప్రోమో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dashamakan : వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో వెంబడిస్తుంటారు. హీరో బాత్రూమ్‌లోకి వెళతాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళతారు. హీరో బాత్రూమ్‌లో ఒకడ్ని వేసేసి తాపీగా బయటకు నడుచుకుని వస్తాడు.
READ ALSO: Mahesh Babu – Naga Chaitanya: నాగచైతన్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
హీరో చంపాలనుకున్న విలన్ మనుషులు బిక్క చచ్చిపోతారు. ఈ సీన్స్‌తో టైటిల్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హరీష్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన రోల్ ఇది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. టైటిల్ ప్రోమోలో చేతిలో చురకత్తి తిప్పుతాడు హీరో. అది చేతిలో పాటలు పాడే మైక్‌లా మారిపోతుంది. అంటే ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయనేది తెలుస్తోంది. ఓ షేడ్‌లో పాటలు పాడితే.. మరో షేడ్‌లో మాస్ అవతార్‌లో యాక్షన్‌తో దుమ్మురేపుతుంటాడు. మరి ఈ రెండు షేడ్స్ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. హరీష్ కళ్యాణ్ సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తుండగా కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.మదన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
READ ALSO: Starlink: విమానాల్లో జెట్ స్పీడ్ ఇంటర్నెట్‌కి స్టార్లింక్ సెట్.. 13 ఏర్‌లైన్స్‌లో 250 Mbps సేవలు
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!