మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ క్యాష్ రీచ్ లీగ్ మార్చ్ 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగునుంది. అయితే వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్ అయినా ఆల్ రౌండర్లదే కీలక పాత్ర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్భాంధవులుగా మారి మ్యాచ్ ను ఓ మలుపు తిప్పుతారు. మెరుపు వేగంతో కదులుతూ అద్భుతమైన క్యాచులు ఒడిసిపడతారు. చిరుతలా రనౌట్లు చేస్తారు.
Also Read : Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్‌లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్
ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తి్ంపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్ రౌండర్లు కచ్చితంగా ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ లో అందిరి కళ్లు పలువురు ఆల్ రౌండర్లపైనే ఉన్నాయి.
Also Read : Maharashtra: దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ను చెట్టుకు కట్టేసి బాలికపై గ్యాంగ్ రేప్
2015లో ముంబయి ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన హార్థిక్ పాండ్య.. వచ్చి రాగానే మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్ లో చెన్నైలో జరిగిన మ్యా,చ్ లో క్లిష్టమైన లక్ష్య ఛేదనలో కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతేడాది లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంగ్రేటంలోనే ట్రోఫీ అందించాడు. 2022 లీగ్ లో 487 పరుగులు సాధించిన పాండ్య.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ మూడు వికెట్లు తీసి 34 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గుజరాత్ సారథిపై ఈసారి అందరి దృష్టి పడింది.
Also Read : European Cricket : అబ్బా బాల్ అక్కడ తగిలింది..
2008 నుంచి 2010 వరకు రాజస్థాన్ తరపున ఆడిన రవీంద్ర జడేజా.. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ తరుపున ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రదర్శన చేశాడు. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే గత సీజన్ లో జడేజా చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఎనిమిదిలో రెండే మ్యాచ్ లను గెలిపించాడు. తిరిగి ధోనీకే అప్పగించాడు. 19 పరుగులు సాధించి ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఏడాది ఎలా అయినా జడ్డూ అదరగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష
ఇప్పటి వరకు ఐపీఎల్ లో అడుగుపెట్టని ఆసీస్ ఆల్ రౌండర్ కామరూన్ గ్రీన్ ను వేలంలో ముంబయి ఇండియన్స్ జట్టు రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. గతేడాది భారత్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో గ్రీన్ బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవడంతో ఇటీవలే జరిగిన టెస్టులో సెంచరీ బాదేశాడు. తొలిసారి ఆడుతున్న గ్రీన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Today Business Headlines 25-03-23: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ సూపర్ మార్కెట్. మరిన్ని వార్తలు
గతేడాది లీగ్ కు దూరమైన ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. వేలంలో అతడిని సీఎస్కే రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ధోనీ తర్వాత.. కెప్టెన్సీ బాధ్యలు బెన్ స్టోక్స్ కు అప్పగిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ లీగ్ లో బెన్ స్టోక్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. గత సంవత్సరం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదుగురు బ్యాటర్లు, బౌలర్లు, ఒక ఆల్ రౌండర్ తో బరిలోకి దిగింది. ఆ ఒక్క ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2023 వేలంలో జాసన్ హోల్డర్ ను రాజస్థాన్ జట్టు రూ. 5. 75 కోట్లకు కొనుగోలు చేసింది.