Hardik Pandya Gambhir Fight: పంజాబ్ ముల్లాన్‌పూర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్ద మొత్తంలో పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ప్రదర్శన అధ్వాన్నంగా ఉండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి విమర్శలకు గురయ్యాడు. ఇదే సమయంలో గంభీర్ – హార్దిక్ పాండ్యాలకు సంబంధించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ ALSO: Vissannapeta Financial Scam: నమ్మించి నట్టేట ముంచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ
గంభీర్ – పాండ్య గొడవపడ్డరా..
నిజానికి ముల్లాన్‌పూర్ మైదానంలో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు కనిపించాయి. మ్యాచ్ తర్వాత నుంచి పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ – టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన వాడివేడి సంభాషణను చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసిన కొంతమంది అభిమానులు, భారత ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ – హార్దిక్ పాండ్యా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలో ఆడియో లేకపోవడం కారణంగా వాళ్లిద్దరూ దేని గురించి చర్చిస్తున్నారో అర్థం కాలేదు.
రెండో మ్యాచ్‌లో 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తన ఖాతా తెరవలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తిలక్ వర్మ ఒక్కడు 62 పరుగులతో వీరోచితంగా పోరాడిన, అప్పటికే చాలా ఆలస్యం అయింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్‌లో కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రమే వారి వారి సాధారణ స్థానాల్లో ఆడారు. దీంతో టీమిండియా ఓటమిలో ఈ కారణం కూడా కీలకంగా మారిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
ధర్మశాలలో 3వ మ్యాచ్..
ఈ రెండు జట్ల మధ్య మూడో మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో టీమిండియా బలమైన పునరాగమనం చేయాలని చూస్తోంది.
Heated conversation between Hardik and Gambhir 👀pic.twitter.com/VtISwnS2FN
— Amar💫 (@KUNGFU_PANDYA_0) December 12, 2025
READ ALSO: AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి