IND vs SL: శ్రీలంక పర్యటన.. భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్స్!
- జులై 26 నుంచి టీ20 సిరీస్
- టీ20 జట్టు కెప్టెన్ ఎవరు
- రోహిత్ స్థానంలో హార్దిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని చాలా మంది అంటున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. గతంలో కూడా టీమిండియాకు అతడు సారథ్యం వహించాడు. కెప్టెన్సీ రేసులో హార్దిక్ ముందున్నప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌దే తుది నిర్ణయం అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్!
మరోవైపు శ్రీలంక టూర్‌లోని వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువ. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రోహిత్.. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. దాంతో వన్డేలకు కెప్టెన్‌గా ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ రేసులో ఉన్నా.. బీసీసీఐ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఓ క్రీడా ఛానెల్ నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని, అతడే సారథిగా ఉంటాడని పేర్కొంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్. దాంతో అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!