Sanjay Dutt playing a key role in Ram Pothineni’s Double iSmart Movie, First look Unveiled: ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‍లో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అనంతరం అటు పూరికి కానీ.. ఇటు రామ్‌కు కానీ పెద్ద హిట్ దక్కలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఈ ఇద్దరు.. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని పూరీ ఆఫీసులో నిర్వహించారు. అంతేకాదు షూటింగ్ కూడా ముంబైలో మొదలైంది. శివరాత్రి కానుకగా 2024 మార్చి 8న మూవీ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా గురించి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్, బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ కీ రోల్‌లో కనిబించబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడు సంజూ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించింది. అంతేకాదు సంజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేసింది. స్టైలిష్ లుక్‌లో గడ్డంతో సంజూ లుక్ అదిరిపోయింది. చెవి పోగులు, వాచ్, ముఖం మరియు వెళ్లపై పచ్చబొట్లతో ఉన్న ఆయన సిగరెట్ తాగుతూ.. సూట్‌లో ఉన్నారు. సంజయ్ సిగరెట్ తాగుతూ అలా చూస్తూ ఉంటే.. గన్స్ స్పాట్స్ ఆయనను టార్గెట్ చేసి ఉన్నాయి. మొత్తానికి సంజూ లుక్ కేజీఎఫ్ 2 రేంజ్ మాదిరి ఉంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ‘బిగ్ బుల్’గా సంజయ్ దత్ కనిపిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో నటించే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందని సంజయ్ ఓ పోస్ట్ చేశారు. ‘మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ ఎనర్జిటిక్ ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ డబుల్ ఇస్మార్ట్‌లో బిగ్ బుల్ పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ సంజూ ట్వీట్ చేశారు.
సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేజీఎఫ్-2లో అధీర పాత్రలో సంజయ్ దత్ చూపించిన విలనిజంకు ఫిదా అయిన ఫాన్స్.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజూ అంతకుమించి ఉంటుందని ఆశిస్తున్నారు. మరి మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అతడిని ఏ రేంజ్‌లో చూపిస్తాడో చూడాలి. 2024 మార్చి 8 రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్-ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
Also Read: Umpire Nitin Menon: బెయిర్‌స్టో తప్పిదం.. పసిగట్టిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗
Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART
Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2023