ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అందులో హనుమాన్ సినిమా ఎంతగా విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.. ఆయన సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.. వైవిధ్యమైన కథలతో రూపోందిస్తారు..డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు.. కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త తరహా సినిమాలనే తెరకెక్కిస్తూ ప్రేక్షకుల నాడీని తెలుసుకున్నాడు..
హనుమాన్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు.. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఇటీవల ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా అక్కడ కూడా దూసుకుపోతుంది.. భారీ వ్యూస్ తో అదరగొడుతుంది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా ‘జై హనుమాన్’ సినిమా రాబోతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని చెప్పినా ఇప్పటివరకు సినిమా స్క్రిప్ట్ గురించి ఎక్కడ ప్రస్థావించలేదు డైరెక్టర్..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా కన్నా ముందు ఇప్పుడు మరో సినిమాను పూర్తి చెయ్యాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది.. ‘ఆక్టోపస్’ అనే సినిమాని కంప్లీట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ‘ఆక్టోపస్’ అనేది ప్రశాంత్ వర్మ చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్.. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందట.. ఫస్ట్ ఆ సినిమాను పూర్తి చేసి తర్వాత జై హనుమాన్ సినిమాను మొదలు పెట్టబోతున్నారని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే…