Site icon NTV Telugu

Weight Loss: బరువు తగ్గడానికి జిమ్ బెటరా.. డైట్ బెటరా..!

Jym

Jym

ఈ రోజుల్లో చాలా మంది బరువు ఎక్కువగా ఉన్న వారు తగ్గడానికి కష్టపడుతున్నారు. ఎందుకుంటే బరువుతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బరువు తగ్గేందుకు డైటింగ్, జిమ్ లపై ఫోకస్ చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలను చూసి.. బరువు తగ్గేందుకు చాలా ట్రై చేస్తున్నారు. అయితే బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే.. ఆహారం, శారీరక దృఢత్వం రెండింటి మధ్య సమన్వయం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో డైటింగ్ మంచిదా జిమ్ మంచిదా అని చెప్పడం కష్టం. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు.. తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లను ఆహారంగా తీసుకుంటే మంచిదని డాక్టర్లు తెలుపుతున్నారు.

Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్‌ ప్రైవేట్‌ వీడియోలు లీక్‌.. అతని పనేనంటూ కేసు నమోదు!

ఆహారం ఎందుకు ముఖ్యం
ఆహారంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరగకుండ అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నట్లయితే జిమ్‌లో చేరవచ్చు. కానీ ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా తిన్నది జీర్ణం కావడానికి ఇంట్లోనే శారీరక శ్రమ చేస్తే మంచింది.

TS Assembly: రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

వ్యాయామశాల చిట్కాలు
అధిక బరువు కారణంగా బరువు తగ్గాలనుకునే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థూలకాయం అనేది ఒక రకమైన వ్యాధి, ఇది హైపర్‌టెన్షన్, మధుమేహం, కీళ్ల నొప్పులకు శరీరాన్ని హాని చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి జిమ్ రోజు చేయండి.

Exit mobile version