Guvvala Balaraju: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటాలు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా ఎన్టీవీ క్వశ్చన్ హవర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ పట్టువిడవకుండా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వచ్చానన్నారు. కేసీఆర్ బిక్ష వల్లే ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే.. కేసీఆర్ లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే కాదు. మీరు వార్డు మెంబర్‌కే సరిపోరు అనే విధంగా నేడు బీఆర్ఎస్ విమర్శలు చేయిస్తోందని మండిపడ్డారు. అదెక్కటి సంస్కృతి అంటూ నిలదీశారు. అయితే.. తెలంగాణ పోరాటం లక్షల మంది చేశారు కదా.. వారందరినీ ఎమ్మెల్యేలుగా చేసేది ఉండే.. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నే ఎందుకు ఎంచుకున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. తాము ఎంత త్యాగం చేశామో.. ఎన్ని పోరాటాలు చేశామో తమకు తెలుసన్నారు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన తనను శాసనసభలోకి అడుగుపెట్టేలా చేసిందన్నారు. కేసీఆర్ చెప్పిందే తూచా తప్పకుండా పాటించానని గువ్వల బాలరాజు అన్నారు.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోనే అవకాశాలు వచ్చాయని… ఏ పార్టీ తనను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు.. ఏ పార్టీలో చేరుతాననే విషయం ఇప్పటికీ ప్రకటించలేదని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.. ఫామ్‌హౌస్ ఎపిసోడ్ కూడా ఓటమికి ఓ కారణమన్నారు.
READ MORE: Alapati Rajendra Prasad: శాతవాహన కళాశాల వివాదంలో ట్విస్ట్.. ఆలపాటి కీలక వ్యాఖ్యలు..
“అచ్చంపేటలో నన్ను మంచి పోటీ చేసేంత స్థాయి కార్యకర్త, నాయకుడు బీఆర్ఎస్లో లేరు. నాకు అక్కడ పొంచి ఉన్న ప్రమాదం కూడా ఏం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రాజీనామా చేయాల్సి వచ్చింది తప్ప.. నా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పొలిటికల్‌గా థ్రెట్ ఉంది నాకు అనేది ఏం లేదు. అచ్చంపేట ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు.. బీఆర్ఎస్లో నా ఆశయాలకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదు.. కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇంటినుంచే ఆదేశాలిచ్చారు.. ప్రభుత్వాన్ని కేసీఆర్ సరిగ్గా ప్రశ్నించడం లేదు.. సమస్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు పోరాటం చేయట్లేదు.. ప్రజల ఎజెండాగా ముందుకెళ్లాలని ఎన్నోసార్లు చెప్పా.. కవిత వ్యవహారంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు.. నా పొలిటికల్ కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదు.” అని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు.