ప్రస్తుతం బయ్యర్స్ ముందున్న ఒకే ఒక్క పెద్ద సినిమా సలార్. ఎలాగైనా సరే ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకోవాలని బడా బడా ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు. కెజియఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. అందుకే.. అన్ని భాషల సలార్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో సలార్ మేకర్స్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ముఖ్యంగా తెలుగు రైట్స్‌కు భారీగా కోట్ చేస్తున్నారట. దాదాపు 200 కోట్ల వరకు కోట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలు.. సలార్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రయత్నాలు చేస్తోందట. దీంతో సలార్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో కెజియఫ్ చాప్టర్ 2 సినిమాను నైజాం ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి.. మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో సలార్ తెలుగు రైట్స్ రేసులోను దిల్ రాజు ఉన్నారు. ఇప్పటికే హోంబలే ఫిలింస్ వారు సలార్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. కానీ సలార్ నైజాం రైట్స్‌కు భారీగా డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. అందుకే.. దిల్ రాజు సలార్ రేసు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో.. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్.. సలార్ రైట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాయట. సలార్ రిలీజ్ సెప్టెంబర్ 28న ఉండడంతో.. అతి త్వరలోనే తెలుగు బిజినెస్ క్లోజ్ కానుంది. మరి ఫైనల్‌గా సలార్ ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి.