Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Agarwal: ఓ వైపు కాలేజీ చదువులు, అసైన్మెంట్లు, ఎగ్జామ్స్.. మరోవైపు సొంతంగా కేఫ్ (Cafe) బిజినెస్! సాధారణంగా 21 ఏళ్ల వయసున్న స్టూడెంట్స్ అంతా తమ ఫస్ట్ జాబ్, కెరీర్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ అనన్య అగర్వాల్ (Ananya Agarwal) మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించి సక్సెస్ సాధించింది. గురుగ్రామ్‌లో (Gurugram) కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ (Rs 15 Lakh Revenue) రాబట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది.
బ్యాచిలర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ (Bachelor’s degree in Management Studies) చివరి సంవత్సరం చదువుతున్న అనన్య, గురుగ్రామ్‌లో ‘లూమ్ & లైమ్’ (Lume & Lime) పేరుతో ఒక ప్యూర్ వెజిటేరియన్ బిస్ట్రో (Vegetarian Bistro) ప్రారంభించింది. కాలేజీ క్లాసులు వింటూనే ఈ బిజినెస్ రన్ చేయడం ఆమెకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయినా సక్సెస్ సాధించింది. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతుండటం వల్ల థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా లభిస్తోందని ఆమె అంటోంది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ.. రెండు వైపులా మేనేజ్ చేయడం కష్టమే అయినా, ఎంటర్ప్రెన్యూర్ షిప్ (Entrepreneurship) అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.
Also Read
- SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
- AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
- Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
సాధారణంగా మన దగ్గర దొరికే ఇటాలియన్ (Italian), మెక్సికన్ (Mexican), లేదా మెడిటరేనియన్ (Mediterranean) ఫుడ్‌లో చాలావరకు ఇండియన్ స్పైసెస్ (Indian Spices) కలిపి ‘ఇండియనైజ్డ్’ (Indianised) చేసేస్తుంటారు. దానివల్ల ఆ వంటకాల ఒరిజినల్ టేస్ట్ మారిపోతుంది. కానీ తమ కేఫ్‌లో అలా కాకుండా, ఒరిజినల్ ఫ్లేవర్స్ (Authentic Flavours) మిస్ కాకుండా అందించాలనే ఆలోచనతోనే ఈ కేఫ్ స్టార్ట్ చేసినట్లు అనన్య చెప్పింది. కేవలం తిని వెళ్లడమే కాకుండా, కస్టమర్లు కాసేపు ప్రశాంతంగా సమయం గడిపేలా మంచి అట్మాస్ఫియర్ (Ambience) క్రియేట్ చేసింది.
ఈ బిజినెస్ జర్నీలో (Business Journey) అనన్య ఒంటరి కాదు. తన తల్లిదండ్రులు డాక్టర్ విశాల్ అగర్వాల్ (Dr Vishal Agrawal), ప్రీతి అగర్వాల్‌లతో (Preeti Agrawal) కలిసి కో-ఫౌండర్‌గా (Co-founder) ఈ కేఫ్ స్టార్ట్ చేసింది. తన తండ్రికి ఉన్న దశాబ్దకాలపు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఆమెకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బ్రాండ్ డిస్కషన్స్ (Brand Discussions), బిజినెస్ మీటింగ్స్, హాస్పిటాలిటీ (Hospitality) రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో సొంతంగా నేర్చుకుంటోంది.
ఇక లూమ్ & లైమ్ కేఫ్ మెనూ (Menu) విషయానికి వస్తే.. ఇటాలియన్, మెక్సికన్, మెడిటరేనియన్ డిషెస్ దొరుకుతాయి. బ్రిక్-ఓవెన్ పిజ్జాలు (Brick-oven Pizzas), హ్యాండ్‌మేడ్ పాస్తా (Handmade Pastas), టాకోస్ (Tacos), మెజ్జే ప్లాటర్స్ (Mezze Platters) తో పాటు స్పెషాలిటీ బ్రెడ్స్ (Specialty Breads), వెరైటీ ఫ్రైస్ (Fries) ఇక్కడ స్పెషల్. వీటితో పాటు స్పెషాలిటీ కాఫీ (Specialty Coffee), డెజర్ట్స్ (Desserts), అలాగే వీగన్ ఆప్షన్స్ (Vegan Options) కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేఫ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక, స్టూడెంట్ లైఫ్‌లోనే ఒక వైపు డిగ్రీ పూర్తి చేస్తూ, మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ నడుపుతూ దూసుకుపోతున్న అనన్య, ఈనాటి యువత, యంగ్ ఎంటర్ప్రెన్యూర్లకు (Young Entrepreneurs) ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలిచింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
-
Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..