AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఏఐ పేరు చెబితే చాలు.. టెక్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టేవి. ఇప్పుడు అదే ఏఐ దెబ్బకు దిగ్గజ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన టెక్ సంస్థలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అసలు ఏఐ బూమ్‌కు బ్రేకులు పడుతున్నాయా? అమెరికా మార్కెట్లలో ఏం జరుగుతోంది?
అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల తర్వాత బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. అయితే ఆ ఉత్సాహం ఒక్కరోజు కూడా నిలవలేదు. గురువారం ఇన్వెస్టర్లు టెక్నాలజీ కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున విక్రయించడంతో నాస్డాక్ సూచీ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 5శాతానికి పైగా పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకున్నా మార్కెట్లలో ఆందోళన మాత్రం తగ్గలేదు.
ముఖ్యంగా ఏఐ రంగానికి అవసరమైన చిప్స్ తయారు చేసే కంపెనీలకు భారీ దెబ్బ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు 6శాతానికి పైగా పడిపోయాయి. AMD షేర్లు ఏకంగా 12 శాతం కుప్పకూలాయి. మెమరీ చిప్స్ తయారు చేసే మైక్రాన్ కంపెనీ కూడా 11శాతం నష్టపోయింది. సెమీకండక్టర్ రంగాన్ని ప్రతిబింబించే ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ 8శాతానికి పైగా పడిపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయితే ఈ పతనానికి కారణం ఏఐపై నమ్మకం తగ్గిపోవడం ఒక్కటే కాదు.. అమెరికాలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి రాజకీయ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండటం కూడా ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
Also Read
- Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
- Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పనిచేయాలంటే భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. దీనికోసం వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. వీటికి అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లు, మెమరీ చిప్స్ అవసరం. అందుకే ఎన్విడియా, AMD, మైక్రాన్ వంటి కంపెనీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ డేటా సెంటర్ల నిర్మాణంపై అమెరికాలో వ్యతిరేకత పెరుగుతోంది. భారీగా విద్యుత్ వినియోగించడం, స్థానిక వనరులపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలతో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యతిరేకత రాజకీయ నాయకుల హామీల్లోనూ కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల్లో గెలిచిన కొందరు అభ్యర్థులు డేటా సెంటర్ల నిర్మాణంపై కఠిన నిబంధనలు తీసుకొస్తామని, అవసరమైతే కొత్త నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించారు. ఇదే ఇప్పుడు టెక్ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఏఐ భవిష్యత్తుపై భారీ అంచనాలతో కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించాయి. ఇప్పుడు డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు ఆలస్యమైతే ఆ పెట్టుబడుల ప్రణాళికలపై ప్రభావం పడుతుంది. దీంతో చిప్స్, ప్రాసెసర్లకు ఉన్న డిమాండ్ కూడా తగ్గవచ్చనే భయాలు మార్కెట్లో మొదలయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కోలుకోవడం కూడా టెక్ షేర్లపై అదనపు ఒత్తిడిని పెంచింది. ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్ల ర్యాలీలో ఏఐ కంపెనీలదే కీలక పాత్ర. అలాంటి సమయంలో రాజకీయ అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. పరిస్థితి మరింత దిగజారితే ఈ పతనం విస్తృత మార్కెట్ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుందనే అంచనాలతో దూసుకెళ్తున్న టెక్ రంగానికి ఇప్పుడు కొత్త సవాలు ఎదురైంది. ఏఐకి అవసరమైన డేటా సెంటర్ల నిర్మాణమే రాజకీయ, సామాజిక వివాదాల్లో చిక్కుకుంది. మరి ఈ అడ్డంకులను దాటుకుని ఏఐ రంగం మళ్లీ పుంజుకుంటుందా? లేక ఈ పరిణామాలు టెక్ దిగ్గజాలకు మరిన్ని నష్టాలు తెచ్చిపెడతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
ట్రెండింగ్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?