KTR : కేటీఆర్ కృషితో.. 18 ఏళ్లకు స్వదేశానికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషితో… 18 ఏండ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు. అందరికీ విమాన టిక్కెట్లు సమకూర్చిన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఆగని కన్నీళ్లు… 18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 18 సంవత్సరాలుగా జైల్లో 5 గురు జిల్లా వాసులు మగ్గుతున్నారు. రెండు నెలల క్రితం దుబాయ్ జైల్ నుండి కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా.. మరొకరు రెండు రోజుల క్రితం రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు విడుదలై ఇంటికి చేరుకున్నాడు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్నారు జిల్లా వాసులు. ఇవాళ పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు విడుదలై ఇంటికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో విడుదల కానున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన ఒక్కరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు.
అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్ష పై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు. జైల్లో ఉన్న మా భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసిన కృషి సఫలం అయ్యాయని అతనికి మేము జీవితాంతం రుణపడి ఉంటామాని తెలిపారు.
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!