Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించడంతో పార్టీ వైఖరి నచ్చక సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ శంకర్ చౌధరికి తన రాజీనామా పత్రాన్ని ఆయన సమర్పించారు. అదే విధంగా పార్టీకి కూడా వీడ్కోలు చెప్పారు. అనంతరం సీజే చావ్దా మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్నాను.. ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండటంతో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.. రాముల వారు ఎప్పుడు కోలువుదీరుతారా అని అందరం ఎదురుచూస్తున్నాం.. కానీ, ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందనే విషయం తనకు అర్ధం కాలేదని సీజే చావ్దా తెలిపారు.
Read Also: Nani: దిల్ రాజు చేతికి సరిపోదా శనివారం థియేట్రికల్ రైట్స్…
అయితే, గుజరాతీగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చేసే పనులకు తాము మద్దతుగా ఉంటాను.. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని సీజే చావ్దా వెల్లడించారు. ఇక, చావ్దా రాజీనామాతో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ బలం 15కు పడిపోయింది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆయన ఆనంద్ జిల్లాలోని ఖంబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.