మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే సహధర్మచారిణిపై విమర్శలు చేస్తే చంద్రబాబుకు కోపం వస్తుందంటూ సెటైర్లు గుప్పించారు మంత్రి అమర్నాథ్. జనసేన కంటే ముందుగా చంద్రబాబు స్పందిస్తున్నారని, చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య బంధం ఇప్పుడు బట్టబయలైందని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఆ బంధాన్ని సక్రమం చేసుకునేందుకు పాకులాడుతున్నారని, చంద్రబాబు వెనుక ఐదు కోట్ల మంది ఉంటే కుప్పం మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు.
Also Read : Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
చంద్రబాబు ఉడత బెదిరింపులకు మా కార్యకర్త కూడా భయపడడని ఆయన అన్నారు. మా తాత నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా తండ్రి మంత్రిగా చేశారు. నేను మంత్రిగా కొనసాగుతున్నాను. మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి కూడా పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం పవన్ వెంపర్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు.
Also Read : Hoax Call: రైల్వే పోలీసుపై కోపం.. పుణె రైల్వేస్టేషన్‌కు బూటకపు కాల్