మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు ముమ్మరంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు అంగీకరించింది సివిల్ ఏవియేషన్ శాఖ. మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు.
Read Also: Manipur: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. రెండు స్పెషల్ ఫ్లైట్స్ సిద్దం
వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.
ఇటు అనంతపురంలో మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న అనంతపురం పట్టణానికి చెందిన విద్యార్ధిని యజ్ఞ శ్రీ ఆందోళన చెందుతుంది. ఈమేరకు యజ్ఞ శ్రీ ఎన్టీవీతో ఆవేదన పంచుకుంది. మణిపూర్ లోని ఎన్. ఐ. టీ లో సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది యజ్ఞ శ్రీ. అల్లర్ల నేపధ్యంలో తమ పాప ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారు ఆమె తల్లిదండ్రులు. మంచి నీళ్ళలో విషం కలిపారని…. ఎన్ ఐ టీ లో కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకడం లేదని పేరెంట్స్ కు చెప్పింది యజ్ఞ శ్రీ. తమ పాపతో పాటు… మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.
Read Also: Imran Khan: పాకిస్తాన్ పరువు పోతోంది.. బిలావల్ భుట్టో భారత్ వెళ్లి ఏం సాధించాడు..?