పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పన్నీర్ తో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పాలతో తయారు చేస్తారు.. శాకాహారులకు ఇది నాన్ వెజ్ లాంటిది. పన్నీర్ తో కూర చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు ఈ కూరలో వేసే మసాలా పదార్ధాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎక్కువగా పన్నీర్ లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వంటి మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. కొంతమంది పరాఠా, దోస వంటి వాటిని కూడా ఈ పన్నీర్ తో ఫిల్లింగ్ చేస్తారు. మలై పనీర్, కర్డ్ పనీర్, పనీర్ రోల్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు..
పన్నీర్ తో చేసే వంటలు రుచి బాగుంది కదా అని ఎక్కువగా తింటున్నారా.. అయితే భారీ ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇష్టం కదా అంటూ అత్యాశకు వెళ్లి ఎక్కువ తింటే సమస్యలు తప్పవు. చీజ్ పోషక పదార్ధం . ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి చీజ్ ముఖ్యం. అయితే ప్రతిరోజూ జున్ను తినడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.. జున్ను ఎక్కువగా తినడం వల్ల లాక్టోస్ లో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే పాలు, పాల పదార్ధాలతో తయారు చేసే పదార్ధాలను తినడం వలన అనారోగ్య సమస్యలున్నవారు సైతం పన్నీరుని తినవచ్చు..
జున్ను ఎక్కువగా తినడం వల్ల లాక్టోస్ లో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే పాలు, పాల పదార్ధాలతో తయారు పదార్ధాలను తినడం వలన సమస్యలున్నవారు సైతం పన్నీరుని తినవచ్చు.. ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్‌తో పాటు ఎసిడిటీ సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. దాంతో పాటు బరువు పెరగడం, మధుమేహం సమస్యలు, కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతూనే ఉంటాయి..పన్నీరు ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి సమస్యతో ఇబ్బంద ప్దుపడతారు. అంతేకాదు దరదతో పాటు అలర్జీ సమస్యలు కూడా బాగా పెరుగుతాయి.. అందుకే వీటిని తక్కువగా తినాలి.. ఏదైనా లిమిట్ గా తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.