NTV Telugu Site icon

Governor Tamilisai : విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోంది

Tamilisai

Tamilisai

వ్యవసాయం విద్య రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ స్పందించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు వ్యవసాయ, విద్య రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. విద్యాశాఖకి మంచి కేటాయింపులు చేశారని, టెక్నాలజీ, జాబ్ క్రియేషన్, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, ఎన్నో రకాలుగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు తమిళిసై.

Also Read : Bhatti Vikramarka : మీరు అధికారంలోకి రావడానికి ముందే ఐటీ హైదరాబాద్‌కి వచ్చింది

డిజిటల్ లైబ్రరీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ పెంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్టు మన దేశంలో చాలా మరణాలు సంభవిస్తాయి అని అన్నారు… కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాక్సినేషన్, మనమే వాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసామని ఆమె వెల్లడించారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, అండ్ రీసెర్చ్, కు కేటాయింపులు పెరిగాయని, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని ఆమె తెలిపారు. వచ్చే 3 సంవత్సారాలు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మిల్లెట్ భోజనంపైన అవగాహన పెంచుతున్నామని, రాజ్ భవన్ లో కూడా వినియోగం పెంచామన్నారు. అందరూ వారి వారి విభాగాల అభిప్రాయాలు రాసి ఇవ్వండి… బుక్ ప్రింట్ చేస్తున్నామని ఆమె అన్నారు.

Also Read : Cricket Coach Massage: మసాజ్ చేయించుకున్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు