Coach Suspended For Getting Massage From Trainee Cricketer In UP: అతడు ఒక క్రికెట్ కోచ్. తన వద్ద శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు క్రికెట్ ట్రిక్కులు నేర్పించడం, ఆ క్రీడా పట్ల పూర్తి అవగాహన కల్పించడం అతని బాధ్యత. కానీ.. ఒక కోచ్ మాత్రం అందుకు భిన్నంగా పాడు పని చేశాడు. మైనర్ క్రికెటర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. దీంతో, అతని ఉద్యోగం ఊడిపోవడంతో పాటు పరువు గంగలో కలిసిపోయింది. ఆ కోచ్ పేరు అబ్దుల్ అహద్. ఇతడు ఉత్తరప్రదేశ్‌లోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక కోచ్‌గా క్రికెట్‌పై శిక్షణ ఇవ్వాల్సి అతడు.. ఓ మైనర్‌తో మసాజ్ చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. అది పై అధికారుల కంట పడింది. దీంతో.. ఆ కోచ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్‌పీ సింగ్ సస్పెండ్ చేశారు. అంతేకాదు.. ఆ ఉదంతాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు, అబ్దుల్ అహద్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోందని, డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్‌ఎన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించామని ఆర్పీ సింగ్ వెల్లడించారు.
Formula E Race: ఆహా.. స్టార్ హీరోల సతీమణులు.. పతులు లేకుండానే వచ్చారే
కాగా.. రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో అబ్దుల్ అహ్మద్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తూనే, వార్డన్‌గా పని చేస్తున్నాడు. ఈ స్టేడియంలో క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం ఉంది. తాను వార్డన్ కూడా కావడంతో, అబ్దుల్ ఆ హాస్టల్‌లోనే తిష్టవేశాడు. ఇతడు చాలాకాలం నుంచి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని యువ క్రికెటర్లు కంప్లైంట్ ఇచ్చారు. అయితే.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వీడియో రికార్డ్ చేసి, ఆ కోచ్ బండారాన్ని బయటపెట్టారు. నెట్టింట్లో వైరల్ అయిన ఆ వీడియోలో.. మసాజ్ చేస్తున్న మైనర్ క్రికెటర్ అయిష్టంగా కోచ్‌కి బాడీ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. కోచ్‌లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం చాలా ఫిర్యాదులు అందాయి. దీంతో.. ఈ విషయాలపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్