దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బొజ్జగణపయ్య కొలువుదీరారు. హైదరాబాద్ ఖా శాన్… ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహా వినాయకుడు.. స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క లలిత త్రిపుర సుందరి… శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరారు.. ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ లో కొలువు తీరుతున్న మహా గణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు… ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి ఏటా లక్షలాదిగా దర్శించుకుంటారు.. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు..
ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేరుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ప్రారంభించారు. వర్షంలోనే గవర్నర్ దంపతులు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుని కోరుకుంటున్నానని తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశుడికి 15 కిలోల వెండి కడియం, వెండి జంజం సమర్పించారు ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. బోనాల వేడుకల లాగే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.