దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బొజ్జగణపయ్య కొలువుదీరారు. హైదరాబాద్ ఖా శాన్… ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహా వినాయకుడు.. స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క లలిత త్రిపుర సుందరి… శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరారు..…
హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమిచ్చాడు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
యూరియా సరఫరాపై తుమ్మల ఓపెన్ లెటర్.. కేంద్రం వైఫల్యంతో రైతులు ఇబ్బందులు తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హామీ ఇచ్చారు. లేఖలో ప్రభుత్వం ఇప్పటి వరకు పాత…