ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్స్ అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు చెందిన నోట్స్‌ను త్వరితగతిన, సమర్థవంతంగా చూసిరాయడం వీరి ప్రధాన విధి.
అంతేకాకుండా డ్రాఫ్ట్ స్పీచ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నోట్ ప్రిపేర్ చేయడం, వ్యవస్థీకృత ఫైలింగ్ సిస్టమ్‌లను నిర్వహించడం, మంత్రులు, ఇతర అధికారులకు అసిస్టెంట్‌గా వ్యవహరించడం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేయాల్సి ఉంటుంది. గ్రేడ్-సీ స్టెనోగ్రాఫర్స్ మూల వేతనం(బేసిక్ పే) రూ.14,500గా ఉండవచ్చు. ఇక గ్రేడ్-డీ వారికి రూ.7,600గా ఉంటుంది. బేసిక్ పేతో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు డియర్‌నెస్ అలవెన్స్ , ఇంటి అద్దె అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్‌తో సహా వివిధ ప్రయోజనాలు పొందడానికి అర్హులు…
ఈ ఉద్యోగాల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా డెవలప్ కావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ అనేది మీ వ్యక్తిగత పనితీరు, నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి..ఆగస్టు 23, 2023 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతో పాటు.. స్టెనోగ్రఫీ తెలిసి ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23లోపు అధికారిక పోర్టల్ ద్వారా https://ssc.nic.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవచ్చు..