Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో తన కారుకు ప్రమాదం జరిగింది. ధూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.
Read Also: Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై రాజా సింగ్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనం చాలా పాతది కావడంతో, దాన్ని మార్చాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తన భద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా అనేకసార్లు వాహనం రోడ్డుపై మొరాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిలిచిపోవడంతో వేరే వాహనాల్లో రాజా సింగ్ వెళ్లేవారు.
Read Also: Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌పై అలా అనకుండా.. ఇలా అంటే బాగుండేది..