గోపీచంద్ కు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన రీసెంట్ సినిమా రామబాణం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ పోలీస్ ఆఫీసర్ గా భీమా సినిమా ను చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..గోపీచంద్ ప్రభాస్ కు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అనే సంగతి అందరికి తెలుసు.. ఎప్పటి నుండో వీరిద్దరీ స్నేహబంధం కొనసాగుతుంది.. ఒకరి సినిమాల విడుదల కు మరొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం వంటివి చేస్తుంటారు.. రేపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. ఈ క్రమంలోనే గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్ టీమ్ కు స్పెషల్ విషెష్ తెలిపారు.
విడుదల సందర్భం గా గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ప్రభాస్ రాముడిగా నటించడం ఎంతో సంతోషంగా ఉందని.. రేపు సినిమా విడుదల అవుతున్న సందర్భంగా టీమ్ అందరికి కూడా అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ వరుసగా రెండు ప్లాప్స్ తర్వాత ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ ఇతిహాస కథను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో మెరిసింది.ఇక బాలీవుడ్ స్టార్ హీరో పది తలల రావణాసురుడిగా నటించాడు.. ఈ సినిమా రేపు అనగా జూన్ 16న గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమాతో భారీగా రికార్డ్స్ క్రియేట్ చేయాలనీ ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపు విడుదల సందర్బంగా ఫ్యాన్స్ ఈ రాత్రి నుండి హడావుడి మొదలు పెట్టారు. థియేటర్స్ అంతా బ్యానర్స్ తో నింపేశారు.