వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సతమతమవుతుంది. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ ల నుంచి వర్క్ చేయాలని గూగుల్ కోరుతున్న పలువురు ఎంప్లయిస్ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగుల హాజరు, కార్యాలయంలో సిబ్బంది కదలికలను ట్రాక్ చేస్తూ పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా గ్రేడింగ్ ఉంటుందని కంపెనీ గూగుల్ హెచ్చరించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గూగుల్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకోని ఉద్యోగులు కంపెనీ తమను స్కూల్ పిల్లల్లా చూస్తుందని అసహనం వ్యక్తం చేశారు.
Also Read : Peddireddy Ramachandra Reddy: ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తాం
హైబ్రిడ్ వర్క్ మోడ్ కు తాము పూర్తిగా మారిపోయామని.. టీమ్ లీడర్లు వారి టీం సభ్యులు హైబ్రిడ్ వర్క్ మోడల్ ను ఎలా అనుసరిస్తున్నారనే దానిపై రిపోర్ట్స్ ను పరిశీలిస్తారని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. గూగుల్ లో మాస్ లేఆఫ్స్ అనంతరం హైబ్రిడ్ వర్క్ పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. వారానికి కనీసం మూడు రోజులైన గూగుల్ ఆఫీస్ లకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు సెర్చింజన్ దిగ్గజం స్పష్టం చేసింది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటానమి గూగుల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
Also Read : Nokia XR21 5G Launch: నోకియా నుంచి వాటర్ ప్రూఫ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే ‘ఐఫోన్’ వైపే చూడరు!
రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరును తనిఖీ చేస్తామని గూగుల్ తేల్చిచెప్పింది. గూగుల్ ఆఫీస్ లకు ఉద్యోగులు విధిగా రావాలని, రిమోట్ వర్కర్లు హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్ ను పాటించాలని.. టీమ్స్ గా పని చేస్తే మంచి ఫలితాలు రాబట్ట వచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని వెల్లడించారు.
Also Read : Putin: అవసరమైతే ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వెనుకాడబోము
అమెరికాలో బ్యాడ్జ్ డేటా ఆధారంగా కార్యాలయాలకు ఉద్యోగుల హాజరును గూగుల్ పర్యవేక్షిస్తుండగా.. ఇతర దేశాల్లోనూ ఈ దిశగా కసరత్తు కొనసాగిస్తుంది. హైబ్రిడ్ మోడల్ పాలసీని వరుసగా ఉల్లంఘిస్తున్న ఉద్యోగులతో హెచ్ఆర్ వర్గాలు మాట్లాడి తదుపరి చర్చలకు సిద్ధం అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ లాంటి ప్రత్యర్థుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ ఎదురవుతున్న తరుణంలో వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసికి కట్టుబడి ఉండాలని ఉద్యోగులపై గూగుల్ ఒత్తిడి పెంచుతుంది.