ఢిల్లీలోని జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఇప్పుడు ఉచిత చక్కెర లభించనుంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆహార భద్రత కార్డుదారులు ఉండి.. అత్యంత అట్టడుగు వర్గాల వారు ఉచిత చక్కెరను పొందగలరని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఉచిత చక్కెర పంపిణీ ప్రతిపాదనకు కేబినెట్ జూలైలో ఆమోదం తెలిపింది. మరోవైపు లబ్ధిదారుల కుటుంబాలకు ప్రస్తుతం గోధుమలు మరియు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఇప్పుడు ఉచితంగా చక్కెర ఇస్తుంది.
Read Also: Yuzvendra Chahal: ఆసియా కప్ టీమ్ లో దక్కని చోటు.. చహల్ ట్వీట్ వైరల్
ఢిల్లీలోని 68,747 మంది జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుంది. అందులో మొత్తం 2,80,290 మంది ఉన్నారు. ఉచిత చక్కెర పంపిణీకి రూ. 111 కోట్లు కేటాయించానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడమే దీని లక్ష్యమని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా.. పౌరులందరికీ అధిక స్థాయిలో ఆహార భద్రత కల్పిస్తామని.. అత్యంత అవసరమైన వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
Read Also: Rohit Sharma: తామేమీ పిచ్చోళ్లం కాదు.. అలా ఎందుకు చేస్తాం..!
అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధిదారులు సబ్సిడీ పథకంలో భాగంగా ఉచిత చక్కెరకు అర్హులు అని ప్రభుత్వం తెలిపింంది. మరోవైపు ఈ ప్రయోజనాన్ని జనవరి 2023 నుండి డిసెంబర్ 2023 వరకు పొడిగించారు. ఈ ప్రయోజనం వల్ల పేదలు, మధ్య తరగతి వాళ్లు సంతోషంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.