మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో ఓ టాబ్లెట్ చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ ప్రజలు మద్యపానం సేవించే సమయంలో ఓ టాబ్లెట్ వేసుకొని మరి తాగుతున్నారు. అయితే ఈ టాబ్లెట్ ఎంత ఆరోగ్యానికి మంచిదో.. అంతే ప్రమాదం అని కూడా తెలుపుతున్నారు.
Also Read: Praja Galam Public Meeting LIVE Updates: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. లైవ్ అప్‌డేట్స్
ఇక ఈ టాబ్లెట్ పేరు మైర్కల్. ఇక ఈ టాబ్లెట్ ని మద్యపానం చేసే ముందు తీసుకుంటే కేవలం గంట సమయంలోనే తాము తీసుకున్న ఆల్కహాల్ ను 70% వరకు శరీరం నుంచి తొలగించిస్తుందట. అంతే కాదండి.. ముఖ్యంగా ఆల్కహాల్ కాలేయానికి చేరకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Bandi Sanjay: రజాకార్ సినిమా చూసిన ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ కూడా చూసి..!
ఇక ఈ టాబ్లెట్ పూర్తిగా సహాజ సిద్ధమైందని వైద్యులు చెబుతున్నారు. ఈ టాబ్లెట్ ఆల్కహాల్ కాలయం లోకి చేరకముందే ఆల్కహాల్ ను నాశనం చేసే గుణాన్ని ఇది కలిగి ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు శరీరంలో ఎనర్జీ, ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచుతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ టాబ్లెట్ 30 ఏళ్ల పరిశోధన ఫలితంగా తాజాగా విడుదలైంది. ఈ టాబ్లెట్ ను పాలిచ్చే స్త్రీలు, గర్భిణీలు, 18 సంవత్సరాల లోపు వారు తీసుకుంటే.. గనుక వారి ఆరోగ్యం పై అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Alcohol Drinkers, liver, health damage, Myrkl TABLET