బంగారం… ఎప్పుడూ డిమాండ్ ఉండే వస్తువు. ముఖ్యంగా మన దేశం లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏ సీజన్ అయినా.. బంగారం వ్యాల్యూ మాత్రం అస్సలు పడిపోదు. అయితే… గత కొన్ని రోజులుగా మన దేశం లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
బంగారం ధర ఇప్పటికే రూ. 50 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45, 900 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, వెండి మాత్రం కొంత మేర పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి 71, 400 కి చేరింది.