Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరల్లో ఒక్కసారిగా క్షీణత కనిపిస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ.1,900 తగ్గడంతో, ప్రస్తుతం రూ.1,42,480 వద్ద పలికింది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 తగ్గి, రూ.1,30,600 వద్దకు చేరింది. మరోవైపు.. కిలో వెండి ధర రూ.2,25,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ తదితర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
Also Read
- Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
- SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,600 స్థాయికి దిగిరావడం విశేషం. పసిడి రేట్లు వరుసగా తగ్గుతూ రావడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ వచ్చిన పసిడి ధరలు, ఈ ధరలకు చేరుకోవడం గమనార్హం. పండుగల సీజన్ , పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరల్లో ఈ తగ్గుదల ధోరణి వినియోగదారులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సూచీల్లో మార్పులను బట్టి బంగారం ధరల ట్రెండ్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి తగ్గతున్న ఈ ధరలతో షాపింగ్ చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
తాజావార్తలు
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
-
Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
-
Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!