Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోదీ ప్రభుత్వం సెబీ నిబంధనల ప్రకారం దేశంలోని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను 25 శాతానికి తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 92.44 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 93.85 శాతం, యుకో బ్యాంకులో 90.95 శాతం, సెంట్రల్ బ్యాంకులో 81.19 శాతంగా ప్రభుత్వ భాగస్వామ్యం కొనసాగుతోంది. సెబీ నిబంధనల ప్రకారం మార్కెట్లో లిస్టయిన ప్రతి కంపెనీలోనూ కనీసం 25 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ఉండటం తప్పనిసరి. ఈ నిబంధనను పాటించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రాబోయే ఒక సంవత్సరంలో ఈ బ్యాంకుల్లో పబ్లిక్ వాటాను పెంచనున్నారు. క్యూఐపీ లేదా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి పెద్దమొత్తంలో షేర్లు విక్రయించడం కష్టమని భావిస్తున్న బ్యాంకులు, గడువును మరో ఏడాది పొడిగించాలని ఆర్థిక శాఖను కోరాయి. మరోవైపు, ప్రభుత్వ వాటా తగ్గింపును ఈ బ్యాంకుల ప్రైవేటీకరణగా భావించరాదని స్పష్టమైంది. ఇది కేవలం పబ్లిక్ షేర్ల నిబంధనను సంతృప్తి పరచడానికే పరిమితం. వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి నిధులు సమకూరడంతో పాటు, సాధారణ ఇన్వెస్టర్లకు ఈ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. షేర్ల విక్రయానికి సంబంధించిన విధివిధానాలు, సమయంపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
Also Read
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
- SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
- AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
తాజావార్తలు
-
Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
-
Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!