బంగారం ధరలు గత కొన్ని నెలలుగా రికార్డులతో హోరెత్తిస్తూ.. వేగంగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలో తులం పసిడి 80 వేల మార్కును దాటేసింది. అయితే గురువారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.1,790 పడిపోయి.. 80 వేల దిగువకు వచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ ఇచ్చాయి. నేడు పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.910 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 8) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850గా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇచ్చాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన వెండి.. నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.94,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా నమోదైంది. అత్యల్పంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో 94 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,850
విజయవాడ – రూ.72,850
ఢిల్లీ – రూ.73,000
చెన్నై – రూ.72,850
బెంగళూరు – రూ.72,850
ముంబై – రూ.72,850
కోల్‌కతా – రూ.72,850
కేరళ – రూ.72,850
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,470
విజయవాడ – రూ.79,470
ఢిల్లీ – రూ.79,620
చెన్నై – రూ.79,470
బెంగళూరు – రూ.79,470
ముంబై – రూ.79,470
కోల్‌కతా – రూ.79,470
కేరళ – రూ.79,470
Also Read: Mohammad Nabi Retirement: రిటైర్మెంట్‌పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.94,000
ముంబై – రూ.94,000
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.94,000
బెంగళూరు – రూ.94,000
కేరళ – రూ.1,03,000