Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..! నేడు ప్రకటించే ఛాన్స్!
- ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..!
- మంగళవారం అధికారికంగా ప్రకటించే ఛాన్స్!
- ఈనెల 20న రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మంగళవారం అధికారికంగా రేఖ గుప్తా పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రేఖ గుప్తా..
రేఖ గుప్తా.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావించింది. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖ గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖ గుప్తాకు అవకాశం దక్కుతోంది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ఇక ఈ నెల 20న రాంలీలా మైదానంలో అత్యంత గ్రాండ్‌గా ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని భావిస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రామ్‌కి హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!