Gold Prices: చాలారోజుల నుంచి నిరంతరాయంగా పెరిగిన బంగారం ధరలు స్వల్ప ఊరటను అందించాయి. ప్రస్తుతం ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా.. బంగారం ధర తగ్గింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు దేశవ్యాప్తంగా భారీగా ధరలు పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీనితో తులం బంగారం ధర రూ. 80,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ధర రూ.440 తగ్గి రూ. 87,380 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే మరోవైపు 18 క్యారెట్ల పసిడి ధర రూ.330 తగ్గి రూ. 65,540 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
Read Also: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు
ఇది ఇలా ఉండగా.. బంగారంను అనుసరించి వెండి ధరలలో కూడా భారీ మార్పులు సంభవించాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో నేడు ఒక్కరోజే కిలో వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గింది . దీనితో కిలో వెండి ధర రూ. 1,06,000 పలుకుతోంది. నిజానికి మరోమారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య పన్నులను వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకుల నుంచి ఇప్పటికే సేఫ్ హెవెన్ గోల్డ్ కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.