నిన్న 490 తగ్గిన తులం గోల్డ్ ధర నేడు రూ. 2,400 పెరిగింది. ఒక్కరోజులోనే పసిడి ధరల్లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,742, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,930 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,200 పెరిగింది. దీంతో రూ. 89,300 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,400 పెరిగింది. దీంతో రూ. 97,420 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,570 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Sofiya Qureshi: కేబినెట్ భేటీకి మంత్రి విజయ్ షా డుమ్మా! రాజీనామా చేసే ఛాన్స్!
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది.