Gold and Silver Price: బంగారం ధరలు క్రమంగా పెరిగి రూ.61 వేల మార్క్‌ను కూడా దాటేశాయి.. అయితే, రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 మేర దిగివచ్చింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా తగ్గింది.. కిలో వెండి ధర రూ.200 వరకు కిందికి దిగింది.. దేశంలోని పలు సిటీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
Read Also: Heart Attack: విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ఆకస్మిక మృతి.. నడుస్తూనే కుప్పకూలి..!
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,090గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,180గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,030గా కొనసాగుతోంది.. ఇక, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640గా ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,990గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,080గా కొనసాగుతోంది.. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.61,030గా ట్రేడ్ అవుతోంది.. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,030గా కొనసాగుతోంది.