Heart Attack: విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం టీవీవీ ప్రసాద్ ఆకస్మికంగా మృతిచెందారు.. ప్లాంటు ప్రొడక్షన్ మానటరింగ్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)గా పనిచేస్తున్న వెంకట వరప్రసాద్.. నిన్న జనరల్ షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు.. అయితే, ఈడీ (వర్క్స్) ఆఫీస్ మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్ దిగి తన రూమ్‌కు నడుస్తూ వెళ్తున్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఇది గమనించిన ఉద్యోగులు వెంటనే ఆయన్ను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉక్కు జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్టు ధృవీకరించారు స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులు.. తీవ్రమైన గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ప్రసాద్ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు..