మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే భారతదేశ సుపుత్రుడు (సపుత్) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గాడ్సే భారతదేశంలోనే జన్మించాడు.. అతను బాబర్, ఔరంగజేబుల మాదిరిగా విదేశీ దురాక్రమణదారుడు కాదని అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కొన్ని పట్టణాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటలపై మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు చేశారు. గాడ్సే..గాంధీని చంపినప్పటికీ ఈ దేశంలోనే జన్మించాడని, భారత మాత ముద్దుబిడ్డా అని ఆయన చెప్పారు.
Read Also : Top Headlines@9AM: టాప్ న్యూస్
ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండ తర్వాత ఔరంగజేబ్-టిప్పు సుల్తాన్‌లను కీర్తిస్తూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ పోస్ట్‌లకు వ్యతిరేకంగా హిందూత్వ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేయగా..ఔరంగజేబును కీర్తిస్తే ప్రతిస్పందించవలసి ఉంటుంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
Read Also : Chennai: సినిమా సీన్ కాదు అంతకుమింది.. రన్నింగ్ బస్సు ఎక్కి దొంగతనం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. గాడ్సే భారతదేశం యొక్క సుపుత్రుడు( సాపుత్ ) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను స్పందించారు. గాడ్సే, గాంధీని హత్య చేసిన కూడా అతను భారత జాతి ముద్దుబిడ్డా ( సుపుత్రుడు)గా అభివర్ణించాడు. ప్రస్తుతం బాబర్-ఔరంగజేబ్ లను కీర్తిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లపై బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.