Ram Charan In Kadapa: శనివారం నాడు మొదలైన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవానికి ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే నేడు జరుగుతున్న అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో కడప నగరంలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి 7 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వచ్చారు. ఇక రామ్ చరణ్ వస్తున్నారని తెలుసుకున్న మెగా అభిమానులు, జనసేన అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద నుండి సందడి వాతావరణం నెలకొల్పారు.
Also Read: Powerlifting Championship: పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారతీయ తండ్రీ కొడుకులు
ఈ నేపథ్యంలో ఆయనకు కడపలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రామ్ చరణ్ విమానాశ్రయం నుంచి నేరుగా నగరంలోని విజయదుర్గ దేవాలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ బుచ్చి బాబుతో కలిసి #RC16 సినిమా స్క్రిప్ట్ ను అమ్మవి దెగ్గర ఉంచి పూజ చేయించారు. ఆ తర్వాత నేరుగా కడప దర్గాకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ముషాయిర కార్యక్రమంలో పాల్గొని చాదర్ సమర్పించారు.