సమంత మరియు రాజ్ ల వివాహం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, ఈ నెల 1న అధికారికంగా ఒక్కటైంది. అయితే, అంతకుముందే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చర్చకు ప్రధాన కారణం.. పెళ్లి వేడుకలో సమంత ధరించిన ఉంగరం. ఇటీవల పోస్ట్ చేసిన వివాహ ఫోటోలో కనిపించిన అదే ఉంగరం, ఆమె వాలెంటైన్స్ డే కు ఒక రోజు ముందు (ఫిబ్రవరి 13) షేర్ చేసిన పోస్ట్‌లలో కూడా దర్శనమిచ్చింది. దీంతో, సమంత-రాజ్ జంట వాలెంటైన్స్ డే సందర్భంగా లేదా అంతకుముందే అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకుని ఉండొచ్చని అభిమానులు, మీడియా వర్గాలు భావిస్తున్నారు.
Also Read : Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
ఈ జంట తమ రిలేషన్‌షిప్ గురించి తరచూ సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా హింట్‌లు ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఫిబ్రవరి 13 నాటి ఫోటో, తాజా వివాహ ఫోటోలలో ఒకే తరహా ఉంగరం కనిపించడం ఈ నిశ్చితార్థం వార్తలకు మరింత బలం చేకూర్చింది. సమంత-రాజ్ తమ రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచడంలో సఫలమైనప్పటికీ, ఇప్పుడు ఈ “సేమ్ రింగ్” అంశం వారి రిలేషన్ జర్నీ పై కొత్త చర్చకు తెర తీసింది. ఈ నేపథ్యంలో, ఈ జంట తమ నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించే వరకు, ఈ ఊహాగానాలు కొనసాగే అవకాశం ఉంది.