ఓటీటీలోకి ప్రతి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అయితే ముందుగా ప్రకటించిన డేట్ కు కొన్ని సినిమాలు వస్తే, ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది..నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ హీరోలుగా నటించిన తెలుగు కామెడీ మూవీ కిస్మత్ ఓటీటీలోకి వచ్చేసింది…
ఈ సినిమా ఎటువంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనాథ్ బాదినేని నూతన దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.. రెండు నెలల క్రితం థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఆ రోజున సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది..
మత్తు వదలరా సినిమాతో నటుడిగా నరేష్ అగస్త్య. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. మెన్ టూ, సేనాపతి, హ్యాపీ బర్త్‌డే వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తమ ఊర్లల్లో గొడవలు వస్తుంటాయి.. అందుకే ఊర్లను వదిలేసి బ్యాక్‌డోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని డబ్బు పెడతారు. కానీ ఆ కంపెనీ మూతపడటంతో రోడ్డున పడతారు.. ఆ తర్వాత ఎం జరిగింది అనేది సినిమా కథగా చూపించారు.