వేసవిలో, పగటిపూట వేడి కారణంగా కొన్నిసార్లు వాహనాలలో మంటలు సంభవిస్తాయి. ఇందుకు సంబంచి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బైక్ రైడింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదనంగా, ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈమధ్య ఇలాంటి ఘటనలకు కారణం అవుతుంది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజా ఘటన అందుకు పూర్తి భిన్నం. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
Read Also: Fake Company: బోగస్ కంపెనీని వివరాలను బట్టబయలు చేసిన పోలీసులు.. 17 మంది అరెస్టు..
ఈ వైరల్ వీడియో ఒక వ్యక్తి పసుపు మోటార్ సైకిల్ పై వీధిలో వెళుతున్నట్లు కనపడుతుంది. స్టైలిష్‌గా బైక్ నడుపుతూ అద్దాలు, బ్యాగ్ పెట్టుకున్నాడు. అతను గ్యాస్ పెడల్ నొక్కినప్పుడు, బైక్ చక్రం దగ్గర మంటలు చెలరేగాయి. ఆ వెనువెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. సకాలంలో మంటలను గమనించిన వ్యక్తి వెంటనే బైక్‌ను విసిరేసి పారిపోయాడు. దాంతో అతను పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. దింతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను పొందింది. వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను వివిధ రకాలుగా తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసి మీరు ఎలా ఫిల్ అయ్యారో ఓ కామెంట్ చేయండి.